Vishwakarma Yojana Telugu

PM విశ్వకర్మ పథకం 2024 – ఆన్‌లైన్ దరఖాస్తు, జాబితా & అర్హత – PM Vishwakarma Scheme Telugu

PM Vishwakarma Scheme: కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన పీఎం విశ్వకర్మ స్కీమ్ లో భాగంగా రూ. 3 లక్షల లోన్ పొందవచ్చు. సాంప్రదాయ చేతిపనులు, చేతివృత్తుల్లో నిమగ్నమైన వారికి ఆర్థిక సాయం, కావాల్సిన శిక్షణ అందించడమే ఈ పథకం ఉద్దేశ్యం. ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ చూడండి

ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 18 సంవత్సరాలు నిండి ఉండాల్సిందే.

పీఎం విశ్వకర్మ స్కీమ్ – అప్లికేషన్ ప్రాసెస్ ఇదే

విశ్వకర్మ యోజన ఆన్‌లైన్ దరఖాస్తు విధానం
విశ్వకర్మ యోజనకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ క్రింది విధంగా ఉంటుంది.

4 ప్రధాన దశలు:

ఆధార్ మరియు మొబైల్ ధృవీకరణ:
మీరు సమీపంలోని CSC కేంద్రానికి వెళ్లి మీ ఆధార్ కార్డు మరియు మొబైల్ నంబర్‌ను ధృవీకరించుకోవాలి. ఈ ప్రక్రియ తప్పనిసరి, ఎందుకంటే ఇది మీ గుర్తింపును ధృవీకరిస్తుంది.

కళాకారుల నమోదు:
మీరు CSC ద్వారా మీ కళాకారుల నమోదును పూర్తి చేయాలి. ఈ ప్రక్రియ మీరు పథకానికి అర్హులు అని నిర్ధారిస్తుంది మరియు మీ వృత్తి గుర్తింపును ధృవీకరిస్తుంది.

దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి:
మీరు CSC కేంద్రం ద్వారా మీ అన్ని సమాచారాన్ని సమర్పించి పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. దీనిలో మీ వ్యక్తిగత సమాచారం, వృత్తిపరమైన సమాచారం మరియు అవసరమైన పత్రాల స్కాన్ కాపీలు ఉంటాయి.

సమాచారం యొక్క ధృవీకరణ:
గ్రామ పంచాయతీ లేదా పట్టణ స్థానిక సంస్థ (ULB) ద్వారా మీ దరఖాస్తులో సమర్పించిన సమాచారం యొక్క మొదటి దశ ధృవీకరణ జరుగుతుంది. తరువాత, మరో రెండు దశల ధృవీకరణ తర్వాత, మీ సమాచారం అంతా సరైనదిగా ఉంటే మరియు మీరు పథకానికి అర్హులు అని తేలితే, మీ దరఖాస్తు ఆమోదించబడుతుంది.

ఆన్‌లైన్ దరఖాస్తు ఆమోదించబడిన తర్వాత:

కొంత శిక్షణ తర్వాత మీకు PM విశ్వకర్మ డిజిటల్ ID మరియు సర్టిఫికెట్ అందించబడుతుంది.
ఈ సర్టిఫికెట్ మీ గుర్తింపు మరియు పథకం కింద మీ నమోదును ధృవీకరిస్తుంది.
శిక్షణ మరియు సర్టిఫికెట్ పొందిన తర్వాత, మీరు రుణాల కోసం PM విశ్వకర్మ యోజన పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రധాన గమనికలు:

మీరు పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ముందు అర్హత ప్రమాణాలను జాగ్రత్తగా చదవండి.
అవసరమైన అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి.

దరఖాస్తు ప్రక్రియలో ఏదైనా సందేహాలు ఉంటే, సమీపంలోని CSC కేంద్రాన్ని సంప్రదించండి.

CSC కేంద్రాలను కనుగొనండి:

మీరు PM విశ్వకర్మ యోజన వెబ్‌సైట్‌లో CSC కేంద్రాల జాబితాను కనుగొనవచ్చు.

PM విశ్వకర్మ స్కీమ్ కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు:

  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు
  • కుల ధృవీకరణ పత్రం
  • బ్యాంక్ పాస్ బుక్

విశ్వకర్మ పథకానికి అర్హతలు:

  • OBC కమ్యూనిటీకి చెందిన వారు మాత్రమే అర్హులు.
  • 18 ఏళ్లు నిండి ఉండాలి.
  • గత ఐదేళ్లలో ఎలాంటి రుణాలు తీసుకోకూడదు.
  • ఈ పథకానికి కుటుంబంలో ఒక్కరు మాత్రమే అర్హులు.
  • ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉంటే ఆ కుటుంబం ఈ పథకానికి అనర్హులు.

ఎంపిక ప్రక్రియ:
దరఖాస్తులను మూడు దశల్లో పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు.

లాభాలు:
అర్హత సాధించిన అభ్యర్థులకు 15 రోజుల శిక్షణ ఇస్తారు.
శిక్షణ సమయంలో రోజుకు రూ.500 స్టైఫండ్ చెల్లిస్తారు.
శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ అందజేస్తారు.
కులవృత్తుల కార్మికులకు పనిముట్లు కొనుగోలు చేసేందుకు రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేస్తారు.

గమనిక:
ఈ సమాచారం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఖచ్చితమైన సమాచారం కోసం సంబంధిత అధికారులను సంప్రదించండి.

అదనపు సమాచారం:

PM విశ్వకర్మ యోజన వెబ్‌సైట్: https://pmvishwakarma.gov.in

Introduction to PM Vishwakarma Scheme

భారతదేశం లోనిగ్రామీణ ప్రాంతాల లో మరియు పట్టణ ప్రాంతాల లో సాంప్రదాయిక చేతి వృత్తి శ్రమికుల కు,హస్తకళ ల నిపుణుల కు అండగా నిలవడం కోసం ఉద్దేశించిన నూతన కేంద్రీయ రంగ పథకం ‘పిఎమ్ విశ్వకర్మ’ కు ఆమోదాన్ని తెలిపిన కేంద్ర మంత్రిమండలి

ఈ పథకాని కి 13,000 కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది పిఎమ్ విశ్వకర్మలో భాగం గా మొదటి విడత లో పద్దెనిమిది సాంప్రదాయిక వ్యాపారాలు లబ్ధి ని పొందనున్నాయి

ఒక క్రొత్త కేంద్రీయ రంగ పథకం ‘‘పిఎమ్ విశ్వకర్మ’’ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) ఆమోదాన్ని తెలియ జేసింది. ఈ పథకాని కి 13,000 కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది. ఈ పథకాన్ని అయిదు సంవత్సరాల కాలం పాటు (2023-24 ఆర్థిక సంవత్సరం మొదలుకొని 2027-28 ఆర్థిక సంవత్సరం మధ్య) అమలు చేయాలని ఉద్దేశించడమైంది. ఈ పథకం గురు-శిష్య పరంపర లేదా చేతివృత్తుల వారు మరియు హస్తకళల ప్రవీణుల కు అండదండల ను అందజేసి, వారిని పెంచి పోషించాలనేది ఈ పథకం యొక్క లక్ష్యం గా ఉంది. చేతివృత్తుల ను అనుసరిస్తున్నటువంటి వారు మరియు హస్తకళల నిపుణులు రూపొందించే వస్తువులు మరియు సేవల యొక్క నాణ్యత ను మరియు వ్యాప్తి ని మెరుగు పరచి, ఆయా విశ్వకర్మ లు దేశీ మరియు విదేశీ వేల్యూ చైన్ లతో ముడిపడేటట్లు చూడాలి అనేది కూడా ఈ పథకం యొక్క ధ్యేయం గా ఉంది.

పిఎమ్ విశ్వకర్మ పథకం లో భాగం గా, చేతివృత్తుల వారి కి మరియు హస్తకళల నిపుణుల కు పిఎమ్ విశ్వకర్మ సర్టిఫికెటు ను, గుర్తింపు కార్డు ను, ఒక లక్ష రూపాయల వరకు (ఒకటో దఫా లో) మరియు 2 లక్షల రూపాయల వరకు (రెండో దఫా లో) రుణ సమర్థన ను 5 శాతం తగ్గింపు వడ్డీ రేటు తో అందించి, వారి కి ఒక గుర్తింపు ను ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం లో భాగం గా నైపుణ్యాల ఉన్నతీకరణ, పనిముట్టుల సంబంధి ప్రోత్సాహకం, డిజిటల్ ట్రాన్సాక్శన్స్ ఎండ్ మార్కెటింగ్ సపోర్ట్ సంబంధి ప్రోత్సాహకం లను కూడాను అందజేయడం జరుగుతుంది.

భారతదేశం అంతటా పల్లె ప్రాంతాల లో మరియు పట్టణ ప్రాంతాల లో చేతివృత్తుల వారికి, హస్తకళల నిపుణుల కు ఈ పథకం దన్ను గా నిలబడుతుంది. పిఎమ్ విశ్వకర్మ లో భాగం గా తొలి విడత లో పద్దెనిమిది సాంప్రదాయిక వ్యాపారాల ను లెక్క లోకి తీసుకోవడం జరుగుతుంది. ఆయా వ్యాపారాల లో..

విశ్వకర్మ పథకం కింద 18 అర్హత కలిగిన ట్రేడ్‌ల జాబితా

  • (1) వడ్రంగులు;
  • (2) పడవల తయారీదారులు;
  • (3) ఆయుధ /కవచ తయారీదారులు;
  • (4) కమ్మరులు;
  • (5) సుత్తి, ఇంకా పరికరాల తయారీదారులు;
  • (6) తాళాల తయారీదారులు;
  • (7) బంగారం పని ని చేసే వారు;
  • (8) కుమ్మరులు;
  • (9) శిల్పులు (ప్రతిమలు, రాతి చెక్కడం పని చేసేటటువంటి వారు), రాళ్ళను పగులగొట్టే వృత్తి లో ఉండే వారు;
  • (10) చర్మకారులు /పాదరక్షల తయారీ దారులు;
  • (11) తాపీ పనివారు;
  • (12) గంపలు/చాపలు/చీపురులను తయారు చేసేవారు;
  • (13) కొబ్బరి నారతో తయారు అయ్యే వస్తువుల ను చేసే వారు, (సాంప్రదాయిక ఆటబొమ్మల రూపకర్తలు);
  • (14) క్షురకులు (నాయీ వృత్తిదారులు);
  • (15) మాలలు అల్లే వారు;
  • (16) రజకులు;
  • (17) దర్జీలు మరియు;
  • (18) చేపల ను పట్టేందుకు ఉపయోగించే వలల ను తయారు చేసేవారు.. భాగం గా ఉంటాయి.